భారతీయ రైల్వే పూణే నుండి నాలుగు కొత్త వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఇది బెలగావి, షెగావ్, వడోదర, సికింద్రాబాద్ కు కనెక్టివిటీని పెంచనున్నాయి.

ప్రస్తుతం రెండు వందేభారత్ రైళ్లు పూణే నుండి నడుస్తూ, కొల్హాపూర్ హుబ్బళ్లి మార్గాలకు సేవలు అందిస్తున్నాయి. త్వరలో మరో నాలుగు అదనపు రైళ్లను ప్రవేశపెట్టాక పూణే నుండి బయలుదేరే మొత్తం వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల సంఖ్య ఆరుకు చేరనుంది.