రామగుండం పోలీస్ కమీషనరేట్,
తేదీ:24 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే

రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ శాంతి భద్రతల, నేరాల నియంత్రణ విషయంలో పోలీస్‌ అధికారులు అధికారులు, సిబ్బంది సమన్వయంతో అనుభవం, నిబద్దత, క్రమశిక్షణ తో పనిచేయాలని అధికారులకు సూచించారు.

నేరా సమీక్షాలో భాగంగా రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పోలీస్‌ అధికారులతో పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా ఈరోజు కమిషనరేట్‌ కార్యాలయములో అర్ద వార్షిక నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

డిసిపి లు, అడిషనల్ డీసీపీ అడ్మిన్, ఎసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్‌.ఐలు పాల్గోన్న ఈ సమావేశంలో పోలీస్‌ కమిషనర్‌ ముందుగా పోలీస్‌ స్టేషన్‌, డివిజిన్, జోన్లవారిగా పెండింగ్ కేసులకు సంబంధించి నేరస్థుల అరెస్టు, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ, చార్జ్‌షీట్‌కు సంబంధించి ప్రస్తుత కేసుల స్థితిగతులపై పోలీస్‌ కమిషనర్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ముఖ్యంగా రామగుండము పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నమోదైన గ్రేవ్‌ కేసులు, మహిళలపై నేరాలు, ఆస్తి నేరాలు, పోక్సో కేసులు, మిస్సింగ్‌, గంజాయి, రోడ్డు ప్రమాదాల కేసులకు సంబంధించి సమాచారంతో పాటు, గత ఆరు నెలల కాలంలో జరిగిన తప్పిదాలు, భవిష్యత్తు లో కేసుల పరిష్కారం కోసం ఏ విధమైన చర్యలు తీసుకోవడం జరిగిందని మొదలైన అంశాలపై పోలీస్‌ కమిషనర్‌ పోలీస్‌ స్టేషన్‌ వారిగా పోలీస్‌ అధికారులతో సమీక్షా జరిపారు.

అదేవిదంగా నేరాల నియంత్రణ కోసం అధికారులు తీసుకోవాల్సిన ముందస్తూ చర్యలపై పోలీస్‌ కమిషనర్‌ అధికారులతో చర్చించడంతో పాటు, అధికారులతో పొలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ ….

ప్రస్తుతం సైబర్ క్రైమ్స్ అనేది ఒక పెద్ద సమస్య. సైబర్ క్రైమ్స్ పై శ్రద్ద పెట్టాలి. ప్రజలు అవగాహన పరుస్తూ పోలీస్ అధికారులు సైబర్ క్రైమ్స్ పై అవగాహన ఉండి నేరాల నివారణకు, దర్యాప్తు కు సిద్ధంగా ఉండాలి. ఇతర కేసుల దర్యాప్తులో విషయంలో అధికారులు ప్రస్తుతం అందుబాటులో వున్న టెక్నాలజీతో పాటు, శాస్త్రీయ పద్దతిను కూడా అనుసరిస్తూ దర్యాప్తు చేపట్టాలని, అనవసరమైన ఇష్యూ లలో ఎవ్వరిని పోలీస్ స్టేషన్ కు పిలిపించకూడదు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు తప్పక వీడియోగ్రాఫి తప్పక చేపించాలి. ఈ సాక్ష్యంలో వీడియో, ఫోటో గ్రాఫి అప్లోడ్ చేయాలి. అప్పుడు అవి నేరా దర్యాప్తు మరియు నిందితుల పై నేరా నిరూపణ లో బలమైన సాక్ష్యం అవుతుంది దానిని మార్చే అవకాశం ఎవ్వరికి ఉండదు అన్నారు.

గతంలో నమోదైన పెండింగ్ లో వున్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, ప్రధానంగా మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయడంతో పాటు, నిందితులకు కోర్టులో శిక్షలు పడేవిధంగా తగు సాక్ష్యాధారాలను కోర్టుకు అందజేయాల్సిందిగా అలాగే మహిళలు, బాలికల మిస్సింగ్‌ కేసుల్లో అధికారులు వేగం స్పందించాలని తెలిపారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేస్తే నేరాల నియంత్రణ, ప్రజల తో మంచి సత్సంబంధాలు పెరుగుతాయి, ప్రజలకు అందుబాటులో ఉంటూ విషబుల్ గా ఉంటాం, ఆ ప్రాంతం లో ఉన్న సమస్యలు తెలుస్తాయి. కొత్త విషయాలు తెలుస్తాయి, సమస్యలు ముందే తెలిస్తే నేరం జరగకుండా , సమస్య పెద్దగా అవ్వకుండా ముందస్తు చర్యలు చేయవచ్చు. రానున్న పంచాయితీ ఎన్నికలను దృష్టిలో వుంచుకోని స్టేషన్‌ అధికారులు తమ పరిధిలోని గ్రామాలను సందర్శించి తగు సమాచారాన్ని సేకరించాలి. ప్రతి గ్రామం లో తప్పనిసరిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా చూడాలి. ప్రతి ఒక్క అధికారి, సిబ్బంది వారి వారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క గ్రామం, కాలని, ముఖ్య ప్రదేశాలు, సమస్యత్మకంగా ఉన్న గ్రామలు, వ్యక్తుల, ప్రజాప్రతినిధులు, జనాభా, అన్ని వివరాలు అందరికి తెలిసి ఉండాలి.

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ సీనియర్ పోలీస్ అధికారులు, సిబ్బంది అనుభవాలాను తెలుసుకోవడం, ఇన్ఫర్మేషన్ వ్యవస్థ ను మెరుగు పరుచుకోవడం, ఏదైనా సమస్య సమయంలో ఎలా ప్రవర్తించాలి, ఎలా కంట్రోల్ చేయాలి నూతన అధికారులకు, సిబ్బంది శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి.
ట్రబుల్ మాంగర్స్,రౌడీషీటర్ల పట్ల కఠినంగా వ్యవహరించడంతో పాటు వారి కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు.

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారి పట్ల కఠినంగా వ్యవహిరంచాలని, దొంగతనాలు జరగకుండా అధికారులు నిరంతరం అప్రమత్తంగా వుంటూ, నేరాల నియంత్రణ కు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు విజబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్‌ ముమ్మరం చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు సేఫ్టీ విభాగంతో కల్సి పనిచేయాలని, ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించడంతో పాటు రోడ్డు ప్రమాదాలకు గల కారణాలపై విశ్లేషణ చేసి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాలని సూచించారు. చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడిన చట్టపరమైన కఠినమైన చర్యలు తప్పవని గంజాయి అక్రమ రవాణా,నిల్వ, సరఫరా, సేవించడంపై నిఘా, నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, చట్ట విరుద్ధంగా ఎవరు పనిచేసిన ఎవరిని వదిలి పెట్టేది, ఉపేక్షించేది లేదు అని హెచ్చరించారు.

పోలీస్ శాఖ, రామగుండం పోలీస్ కమీషనరేట్ ప్రతిష్ట కు భంగం కలిగించే విధంగా విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని శాఖ పరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీస్‌ అధికారుల పనితీరుపైనే రామగుండము పోలీస్‌ కమిషనరేట్‌ కీర్తి ప్రతిష్టలు ఆధారపడి వుంటాయని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.

ఈ సమావేశంలో మంచిర్యాల డిసిపి ఎ.భాస్కర్ ఐపిఎస్., పెద్దపల్లి డిసిపి కరుణాకర్, అడిషనల్ డిసిపి అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి మల్లారెడ్డి, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్,ఏఆర్ ఏసీపీ ప్రతాప్, కమీషనరేట్ పరిది ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్‌.ఐలు సీఐ లు, వివిధ వింగ్స్ ఇన్స్పెక్టర్ లు, సిసి హరీష్ పాల్గొన్నారు.