మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:24 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
- ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు అవకాశం
- నోటిఫికేషన్ విడుదల చేసిన ఉన్నత విద్యాశాఖ
- రిజిస్ట్రేషన్ లో బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి
- అందుబాటులో బీఏ, బీకాం బిఎఫ్ఎస్ఐ, బీకాం టాక్సేషన్, బీకాం కంప్యూటర్స్, బీఎస్సీ ఎంపిసి, బి జెడ్ సి కోర్సులు.
- ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్
బెల్లంపల్లి: బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏకైక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ స్పెషల్ ఫేజ్ అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్ తెలిపారు. ఈనెల 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు. ఇప్పటికే మూడు విడతల్లో డిగ్రీ సీట్ల కేటాయింపు జరుగగా ప్రస్తుతం డిగ్రీ ప్రవేశానికి దాదాపు ఇదే చివరి అవకాశంగా ఉంటుందని వివరించారు.
అందుబాటులో కొత్త కోర్సులు
అన్ని హంగులతో కొనసాగుతున్న బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రస్తుత 2025-26 విద్యా సంవత్సరంలో నూతన కోర్సులు ప్రారంభమయ్యాయని, వాటిని సద్వినియోగం చేసుకొని ఉపాధి పొందాలని కోరారు.
దోస్త్ వెబ్సైట్ ద్వారా బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లను అందజేస్తున్నామని తెలిపారు. ఇందుకుగాను కళాశాలలో స్వచ్ఛంద హెల్ప్ లైన్ సెంటర్ కొనసాగుతుందని పేర్కొన్నారు. కళాశాలలో బిఏ, బీకాం, బీఎస్సీ ఎంపీసీ, బి జెడ్ సి కోర్సులతో పాటు ఈ ఏడాది కొత్తగా బీకాం “బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్ ఇన్సూరెన్స్”, బీకాం టాక్సేషన్ అందుబాటులో ఉన్నాయని ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్, వైస్ ప్రిన్సిపాల్, దోస్త్ కోఆర్డినేటర్ మేడ తిరుపతి తెలిపారు. డిగ్రీ అడ్మిషన్ దోస్తు సందేహాలకు 9959269975 ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ గారిని సంప్రదించాలని తెలిపారు.
