భారీ వర్షాలతో కిన్నెరసాని నది పరివాహక ప్రాంత ప్రజలకు హెచ్చరిక… –
అప్రమత్తంగా ఉండాలి… హ ఎవరు చేపల వేటకు వెళ్ళవద్దు…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్

కిన్నెరసాని నది పరివాహక ప్రాంత గ్రామాలను పాల్వంచ సీఐ. సతీష్ గారు మరియు ఎస్ ఐ సురేష్ గారు సందర్శించడం జరిగింది.

అలాగే ప్రజలకు కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద నీరు కిన్నెరసాని డ్యాంకు చేరుతున్నందున కిన్నెరసాని డ్యాం గేట్లు ఎత్తే అవకాశం ఉన్నది కాబట్టి కిన్నెరసాని నది పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా ఎవరు కూడా చేపల వేటకు వెళ్లకూడదని అదేవిధంగా కిన్నెరసాని గేట్లు ఎత్తితే వచ్చే వరద నీరుకు కొట్టుకుపోయే అవకాశం ఉన్నందున ఎవరూ కూడా కిన్నెరసాని నది దాటి అవతల వైపు వెళ్లకూడదని సంఘం, దంతెలబోరు, మరియు గంగదేవి గొప్ప గ్రామ ప్రజలకు సూచించనైనది.