ఒక సంక్షేమ పథకం అనేక విప్లవాత్మక మార్పులకు కారణమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఆడబిడ్డలకు ఆర్థిక భారాన్ని తగ్గించిందన్నారు. ఒక్క పథకం వల్ల ఆర్టీసీ సంస్థ అప్పుల నుంచి గట్టెక్కిందని తెలిపారు.
200కోట్ల జీరో టికెట్లతో సరికొత్త రికార్డుకు చేరుకుందని వివరించారు. ఆర్టీసీకి ప్రాణం పోసిన ప్రతి ఉద్యోగి, సిబ్బంది, కార్మికులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు.
