మంచిర్యాల జిల్లా,
మందమర్రి,
తేదీ: 24 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే
మందమర్రి: పాము కాటుతో మహిళ మృతి,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు…
వివరాల్లోకి వెళితే…
మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కపల్లి గ్రామంలో పాము కాటుకు గురై ఒక మహిళ మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.
మృతురాలు మంద శ్రీలత బుధవారం ఉదయం సుమారు 4 గంటల సమయంలో కాలకృత్యాల కోసం బయటకు వెళ్లగా, ఆమె కుడి కాలు మడమపై పాము కాటు వేసింది.
ఈ విషయాన్ని ఆమె వెంటనే తన భర్త అయిన మంద రాజుకు చెప్పడంతో
వెంటనే కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ ద్వారా ఆమెను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అక్కడ చికిత్స పొందుతూ, బుధవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో మంద శ్రీలత మరణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ సంఘటనపై మృతురాలి భర్త మంద రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, మందమర్రి ఏఎస్ఐ మాజీద్ కేసు నమోదు చేసి, శవ పంచనామా నిర్వహించి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు.
