భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
భద్రాచలం నియోజకవర్గం.
✍️దుర్గా ప్రసాద్

దుమ్ముగూడెం మండలం, తురుబాక గ్రామంలో బ్రిడ్జి నిర్మాణ పనులను మరియు తాత్కాలిక రోడ్ కుంగి పోయిందని సోషల్ మీడియా లో వచ్చిన సందర్భంగా స్పందించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు స్వయంగా వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.‌

ఎమ్మెల్యే గారు సంబంధిత రోడ్ కాంట్రాక్టర్ తో మాట్లాడి మరమత్తు పనులను దగ్గర ఉండి పనులను చేపించారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.