భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
కొత్తగూడెం
✍️దుర్గా ప్రసాద్
26న దిశ కమిటి సమావేశం
ఈనెల 26న భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ లో దిశా కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి కో ఛైర్మన్, ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు పాల్గొననున్నట్లు తెలిపారు. కావున సంబంధిత జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని సూచించారు.
