భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
కొత్తగూడెం
✍️దుర్గా ప్రసాద్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 24వ తారీఖు కొత్తగూడెంలో కొత్తగూడెం క్లబ్ లో జరిగిన మహాగర్జన సన్నాహక సదస్సుకు హాజరైన పద్మశ్రీ గ్రహీత మందకృష్ణ మాదిగ నీ మర్యాదపూర్వకంగా కలిసిన యువతరం పార్టీ నాయకులు, మందకృష్ణ మాది గారు చేసిన పోరాటం ఘన నియమని వారి పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కళ్ళు అలవర్చుకోవాలని, మన హక్కులకై మనం పోరాడాలని యువతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని, కొత్త పింఛన్ల దరఖాస్తు ఇప్పటివరకు చేపట్టలేదని, కొన్నిసార్లు పింఛన్ ఇవ్వడంలో జాప్యం జరుగుతుందని, వికలాంగులు, ఒంటరి మహిళలు కేవలం ఆ పింఛన్ మీద జీవిస్తున్న వాళ్లే అని దృష్టిలో ఉంచుకొని, ప్రభుత్వ వారిపై దృష్టి పెట్టాలని, కేవలం నెలవారి పెన్షన్ల మీద జీవిస్తున్న, పేద బడుగు బలహీన వర్గాల పొట్ట కొట్టడం తగదని అన్నారు.
కావున తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టర్లు, ఈ పింఛన్ల కార్యక్రమం పై దృష్టి పెట్టాలని, ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు కేవలం ఆ పింఛన్ ఆధారంగానే జీవిస్తున్నారని గమనించాలని, ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మందకృష్ణ మాదిగ గారిని కోరి, వారి పోరాటానికి యువతరం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యువతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి గుజ్జుల, ఆంధ్ర రాష్ట్ర నాయకులు గుగులోత్ బాబు నాయక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు అజ్మీర నరేష్ నాయక్, మరియు పాల్వంచ మండల నాయకులు బలగం సురేష్ మరియు పార్టీ కార్యకర్తలు జాడి రమేష్ లు పాల్గొన్నారు.
