ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏపీ విభజన చట్టం సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాలని పిటిషనర్ కోరారు.

జమ్మూకశ్మీర్ లో పునర్విభజన చేసే సమయంలో ఏపీ విభజన చట్టాన్ని పక్కన పెట్టారని… రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాజ్యాన్ని అనుమతించడం వల్ల ఇతర రాష్ట్రాల్లోనూ వ్యాజ్యాలు వరదల్లా వస్తాయని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.