బీసీలకు రిజర్వేషన్ పేరుతో ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
నాంపల్లిలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 42 శాతం రిజర్వేషన్లతో నిజమైన బీసీలు నష్టపోతారని చెప్పారు. 10 శాతం ఈబీసీ రిజర్వేషన్లను ముస్లింలు కూడా పొందుతున్నారన్నారు. 42 శాతం రిజర్వేషన్లతో బీసీలకు న్యాయం జరగదని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల వల్ల ఎంఐఎం పార్టీకే లబ్ధి అన్నారు.
