భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్
జగన్నాధ పురం లో ఎం.ఎల్.ఏ కూనంనేని తో కలిసి కొత్త రేషన్ కార్డుల పంపిణలో పాల్గొన్న కొత్వాల
కొత్త రేషన్ కార్డుల పంపిణీతో తెలంగాణా లోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల పట్ల తనకున్న చిత్తశుద్దిని చాటి చెప్పిందని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.
పాల్వంచ మండల పరిధిలోని జగన్నాధపురంలో కొత్తగూడెం నియోజకవర్గ శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు తో కలిసి లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ఎలాంటి రేషన్ కార్డుల పంపిణీ జరుగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే అది సాధ్యమైందన్నారు. కాంగ్రెస్ హయాంలోనే పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ వర్గాల శ్రేయస్సుకై అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుతున్నదని, ప్రజలు ప్రభుత్వానికి మద్దతు తెలపాలని కొత్వాల అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్.డి. ఓ. D.మధు, జిల్లా సివిల్ సప్లై అధికారి రుక్మిణి, తహసీల్దార్ దారా ప్రసాద్, ఎం. పి. డి. ఓ. విజయ్ భాస్కర్ రెడ్డి, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసరావు, ఆర్. ఐ లు రవి కుమార్ రెడ్డి, నళిని కుమార్, మాజీ ZPTC యర్రంశెట్టి ముత్తయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, నాయకులు వై. వెంకటేశ్వర్లు, గంధం నరసింహారావు, భూక్యా గిరి ప్రసాద్, SK. పాషా, సిపిఐ నాయకులు ముత్యాల విశ్వనాధం, వీసంశెట్టి పూర్ణచందర్ రావు, నిమ్మల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
