పీతలు మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తక్కువ కొవ్వు, ఆరోగ్యకరమైన ప్రొటీన్లు ఎంతో శక్తిని ఇస్తాయి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, జింక్, ప్రొటీన్లకు మూలం. కొలస్ట్రాల్ తగ్గించడంలో ఎంతో సహాయ పడతాయి.
గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మెదడు ఆరోగ్యానికి ఉపకరిస్తాయి. భాస్వరం అధికంగా ఉన్నందువల్ల దంతాలు, ఎముకలు ఆరోగ్యానికి ఉపకరిస్తాయి. అందుకే పీతలకు విపరీతమైన డిమాండ్.
