మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:25 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

ఎరువులు కృత్రిమ కొరతలకు పాలు పడితే చర్యలు తప్పవని,అధిక ధరలకు విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయని, అందుబాటులో ఎరువులు ఉన్నాయని, పుకార్లు నమ్మొద్దని జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్ తెలిపారు.

శుక్రవారం బెల్లంపల్లిలో జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్ ఎరువుల దుకాణాలు, గోదాములను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బెల్లంపల్లి పట్టణం లోని పలు ఎరువుల దుకాణలను ఏడిఏ రాజా నరేందర్,ఏవో ప్రేమ్ కుమార్ ల తో కలిసి తనిఖీ చేశారు.

ఎరువుల నిలువలు, అమ్మకం వివరాల రికార్డులను పరిశీలించారు.ఫర్టీలైజర్ డీలర్స్ ఎవరైనా కృత్రిమ కొరత స్ట్రష్టించినా, ఎంఆర్పీ కంటే అధికంగా మొత్తం వసూలు చేసినా లైసెన్స్ లు రద్దు చేసి క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.

యూరియాను జిల్లా దాటిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. జిల్లాకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని, రైతులేవరూ పుకారులు నమ్మి ముందుగానే అధికంగా కొని పెట్టుకోవద్దని తెలిపారు. యూరియా విడతల వారీగా మండలాలకు వస్తుందని, రైతులు కూడా విడతల వారీగా కొనుగోలు చేసుకోవాలని కోరారు. యూరియా కొరత లేదని అందరు సంయమనం పాటించాలని కోరారు.