మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:25 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి పట్టణంలోని టేకులు బస్తీ కి చెందిన కృష్ణవేణి కల్యాణ్ దంపతుల ఇద్దరు చిన్నారులు ప్రాణాంతక వ్యాధితో ఎంతోకాలంగా బాధపడుతున్నారు.
వారి తల్లిదండ్రులు పిల్లల చికిత్స కోసం పడారానిపాట్లు పడ్డారు. పూట గడవడమే కష్టమై నా ఆ కుటుంబానికి పిల్లలకు వైద్యం చేపించే స్తోమతలేదు. స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ (ఎస్ఎంఏ) అనే వెన్నెముక కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్నారు. తమ బాధను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు విన్నవించుకున్నారు.
స్పందించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంటనే చిన్నారులతో సహా తల్లిదండ్రులను నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పరిస్థితి వివరించారు.రాష్ట్ర ప్రభుత్వం నుంచి వైద్య సహాయo అందించాలని కోరారు. తమ పిల్లల అనారోగ్య సమస్యను ఆ దంపతులు కన్నీళ్ళతో విన్నవించారు. హృదయ విదారకరమైన వారి బాధను అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పటికప్పుడే సంబంధిత వైద్య శాఖ అధికారులను వెంటనే వైద్యం అందించాలని ఆదేశించారు.
చిన్నారులకు అవసరమైన వైద్య సహాయాన్ని ప్రభుత్వం తరఫున అందించడానికి భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సహాయాన్ని మర్చిపోలేనమనీ, తమ పిల్లలకు పునర్జన్మ ప్రసాదించినందుకు ముఖ్యమంత్రి కి,ఎమ్మెల్యే గడ్డం వినోద్ కి రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు.
