✍️దుర్గా ప్రసాద్
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టులు వారోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.
మావోయిస్టుల కదలికలు, దాడులను నిరోధించేందుకు ములుగు జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సరిహద్దులోని అటవీ ప్రాంతాలు, అనుమానిత ప్రదేశాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
