భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్

పాల్వంచ పట్టణ పరిధిలోని పాలకోయ తండా నివాసి మున్నూరు కాపు కులస్తుడు కోల అంజన్ రావు కుమారుడు కోలా సాయి చరణ్ 18 సంవత్సరాలు అనారోగ్యంతో నిన్న మృతి చెందగా వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందులలో ఉన్నదనే విషయాన్ని సంఘ సభ్యులు తోట రామకృష్ణ తెలంగాణ మున్నూరుకాపు పటేల్స్ సంక్షేమ సంఘం అధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన కాంపెల్లి కనకేష్ పటేల్ తమ మున్నూరు కాపు సంఘం యొక్క వాట్సాప్ గ్రూప్ లో ఇట్టి విషయాన్ని తెలియపరచగా గ్రూపు సభ్యులు 64 మంది స్పందించి తమ వంతుగా 72,816/- రూపాయలు విరాళాలు అందించారు.

ఇట్టి డబ్బులను ఈరోజు సంఘ సభ్యులు అంజన్ రావు కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా కాంపెల్లి కనకేష్ పటేల్ మాట్లాడుతూ… మున్నూరు కాపు కులస్తులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే ఆ యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఇప్పుడు అంజన్ రావు కుటుంబానికి సహాయం చేసినట్లుగానే గతంలో జగన్నాధపురం గ్రామానికి చెందిన శ్రావణపు పెద్దులు కుటుంబానికి 46203/- రూపాయలు మరియు సోములగూడెం గ్రామానికి చెందిన పెద్దనీటి అనసూర్య కుటుంబానికి 69000/- రూపాయలు తమ సంఘ సభ్యుల ద్వారా విరాళాలు సేకరించి అందించడం జరిగిందని, మున్నూరు కాపు కులస్తులకు ఏమైనా సహాయం అవసరమైతే తెలియపరచగానే సంఘంలోని సభ్యులు స్పందించిన తీరు అద్భుతం అని, విరాళాలు అందించిన మున్నూరు కాపు సోదర, సోదరీమణులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు ఆకుల ఆనంద్, చింతా నాగరాజు, మద్దుల వీర మోహన్ రావు, తోట రామకృష్ణ, బాలినేని సత్యనారాయణ, పూజల ప్రసాద్, అడపా శ్రీను తదితరులు పాల్గొన్నారు.