‘బ్లేజ్ డ్రాగన్ 5G’ పేరు తో లావా నుంచి 5G ఫోన్ రిలీజ్…

దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా ‘బ్లేజ్ డ్రాగన్ 5G’ పేరిట కొత్త ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ 5,000 MAH బ్యాటరీ 18W వైర్డ్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా పనిచేస్తుంది. ఇది సింగిల్ వేరియంట్లో లభిస్తుంది.

4GB+128GB వేరియంట్ ధర రూ.9,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ ఆగస్టు 1 నుంచి అమెజాన్ లో అందుబాటులోకి రానుంది.