KTR పై CM రమేష్ సంచలన ఆరోపణలు!
పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు.
రేవంత్ రెడ్డితో తనకు టీడీపీ నుంచే స్నేహం ఉందని గుర్తుచేస్తూ, రాజకీయం వేరు, స్నేహం వేరని అన్నారు. కేటీఆర్ రాజకీయంగా ఎదిగి మనుషులను మరిచిపోయారని ఆరోపించారు.
కేటీఆర్ పదేళ్ల పాలనలో మాల్దీవులు, అమెరికా పర్యటనలపై తనకు వివరాలు తెలుసని, వాటిని సీబీఐ, ఈడీలకు ఇస్తానని రమేష్ హెచ్చరించారు.
