కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని నేడు పరేడ్ మైదానంలోని అమరవీరుల స్థూపానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్ పై విజయం సాధించి 26 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ, విశ్రాంత సైనికులు పాల్గొని సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. దేశ సత్తాను చాటిన అమరవీరులకు జోహార్లు అర్పించారు.
