మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,నెన్నెల,
తేదీ : 26.07.2025
✍️ మనోజ్ కుమార్ పాండే.

నెన్నెల పోలీసుల ద్వారా కస్తూర్బా బాలికల ఉన్నత పాఠశాల లో అవగాహన కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్ సిఐ సీహెచ్. హనోక్ మాట్లాడుతూ విద్యార్థినులు అందరూ మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకునేలో ఉన్నతమైన ఆశయాలను ఏర్పాటు చేసుకొని, అట్టి ఆశయం సాధించే వరకు పట్టుదలగా కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకొని చదువుకున్న స్కూలు మరియు కన్న తల్లితండ్రులకు మంచి పేరు తీసుకొని రావాలని అన్నారు.

ఎలాంటి చెడు ఆకర్షణలుకు లోను కాకుండా మంచిగా చదువుకోవాలని బెల్లంపల్లి రూరల్ సిఐ విద్యార్థినులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. పోలీస్ లు ఎల్లవేళల మీకు అందుబాటులో ఉంటారు ఎలాంటి సమస్య ఉన్న పోలీస్ వాళ్లకు చెప్పవచ్చని సూచించారు.

ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్ సిఐతో పాటు నెన్నెల్ ఎస్ఐ కె.ప్రసాద్, కానిస్టేబులు అనంత రావు, ప్రసాద్ మరియు కస్తూర్బా స్కూల్ ప్రిన్సిపల్ పి.కవిత,పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు .