మంచిర్యాల జిల్లా,
తాండూరు,
తేదీ:26 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
తాండూర్ మండల కేంద్రంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్రతి శనివారం జరుగు వారసంతలు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఈ వారసంతకు మంచిర్యాల జిల్లా నుండే కాకుండా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నుండి కూడా వేలాది మంది వచ్చి పోతుంటారు.
సంతలో కూర్చోవడానికి షెడ్లు, గద్దెలు, నిర్మించక పోవడంతో ప్రతి శనివారం నేలపైనే వ్యాపారం సాగిస్తున్నారని కురుస్తున్న వర్షాలకు సంత మొత్తం బురద మయంగా మారి కొనుగోలుదారులు, వ్యాపారులు, చాలా ఇబ్బంది పడుతున్నారని అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఉన్నదని అలాగే మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించి వాడకం లో ఉంచాలని ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి సౌకర్యాలు కల్పించాలని ఆయన కోరారు.
