కేటీపీఎస్ ఫోర్ మెన్ రామనీలా ప్రసాద్ మృతి పట్ల సంతాపం తెలిపిన రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్

పాల్వంచ కేటీపీఎస్ కర్మాగారంలో గ్రేడ్ వన్ ఫోర్ మెన్ గా పనిచేస్తున్న ముళ్ళపూడి రామ్ నీళ్ల ప్రసాద్ మరణించారు.

కేటీపీఎస్ కాలనీలోని ఆయన నివాస క్వార్టర్లో భౌతిక కాయానికి రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి, సంతాపం తెలిపారు.

ఈ కార్యక్రమంలో దోర్నాల పాపారావు, దోర్నాల వెంకటేశ్వరరావు, దోర్నాల మోహన్రావు, కొత్వాల సత్యనారాయణ, కొత్వాల ఉమామహేశ్వరరావు, లేబర్ సెల్ చైర్మన్ సాదం రామకృష్ణ, కార్మిక నాయకులు కేశ బోయిన కోటేశ్వరరావు, జాలే కరుణాకర్ రెడ్డి, మల్లికార్జున్, సందు ప్రభాకర్, వివిధ కార్మిక సంఘం నాయకులు కుటుంబ సభ్యులు బంధువులు మిత్రులు పాల్గొన్నారు.

తండ్రి శవానికి తలకొరివి పెట్టిన కుమార్తె

రామ్ లీలా ప్రసాద్ కి కుమారులు లేరు, ఇద్దరు కుమార్తెలే, పెద్ద కుమార్తె సుస్మిత తన తండ్రి చితికి నిప్పంటించి తలకొరివి పెట్టింది.