మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి.
తేదీ:26 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
కార్గిల్ దివస్ ను పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులను వెలిగించి కార్గిల్ అమర వీరులకు శ్రద్ధాంజలి అర్పించి సంతాపం వ్యక్తం చేశారు.లయన్స్ క్లబ్ సభ్యులు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
భారత దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన అమర జవాన్ల ఆత్మ బలిదానాన్ని మరువలేనిదని, వారు ఎల్లప్పుడూ ప్రజల గుండెల్లో ఉంటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు సిలివేరి నర్సింగం, పాపయ్య, మహేశ్వర్ రెడ్డి, ఎర్ర సువర్ణ, ఆదర్శ్ వర్ధన్ రాజు తదితరులు పాల్గొన్నారు.
