తేదీ:27 జూలై 2025,
మంచిర్యాల జిల్లా కేంద్రం
✍️ మనోజ్ కుమార్ పాండే.

మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో పాత బిల్డింగులు శితిలావస్తలో కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. ప్రభుత్వం ప్రైమరీ పాఠశాలలు పెట్టుమని చెబుతుంది కానీ, ప్రభుత్వ విద్యాసంస్థలు శిథిలావస్థలో ఉన్న భవనాలు నిర్మించడం లేదు. వర్షాలు పడితే పాఠశాలల్లో కూర్చునే పరిస్థితి లేదు.కొన్ని హాస్టల్లలో డైనింగ్ హాల్స్ లేక, సొంత భవనాలు లేక, ఇరుకు గదుల్లో ఉంటూ, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శిథిలావస్తలో ఉన్న భవనాలను పరిశీలించి వెంటనే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేయాలని, నూతన భవనాలు ఏర్పాటు చేయాలని. “మన ఊరు మన బడి”ద్వారా పెండింగ్ లో ఉన్న భవనాలను పూర్తి చేయాలని PDSU పీడీఎస్.యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.శ్రీకాంత్ డిమాండ్ చేశారు.

దీనిపై సంబంధిత అధికారులు కలెక్టర్,ప్రజా పాలకులు స్పందించగలరని విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రగశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం కోరింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కె.కార్తీక్ పాల్గొన్నారు.