మంచిర్యాల జిల్లా
బెల్లంపల్లి,
తేదీ:27 జూలై 2025
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి మండల కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, నేరుగా రోగులతో కలిసి ఆసుపత్రిలో లభించే చికిత్స పట్ల ఆరా తీశారు.డ్రగ్ స్టోర్ లో రోగులకు సరిపడే మందులు ఉన్నాయో,లేవో వైద్యుల ద్వారా తెలుసుకున్నారు.

ఆసుపత్రి ఆవరణ పరిశుభ్రముగా ఉండేటట్టు చూసుకోవాలని సూచించారు.ఎటువంటి పరిస్థితుల్లో ఆసుపత్రికి వొచ్చే వారికి అసౌకర్యం కలగకుండా, రోగులు ఇబ్బందులు పడకుండా చూసుకోవాలని సూచించారు.