మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:27 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

ఆదివారం మధ్యాహ్నం ధర్మరావుపేట సెక్షన్ పరిధిలో వెంకటాపూర్ బీట్ రొట్టెపల్లి అటవీ శివారు ప్రాంతంలో మేతకు వెళ్లిన పశువులపై దాడికి పాల్పడిన పెద్దపులి.బెల్లంపల్లి అటవీ క్షేత్రాధికారి పూర్ణ చందర్ మాట్లాడుతూ గోండు గూడ కి చెందిన కురిసేంగ అచ్యుత్ రావు యొక్క లేగ దూడను చంపివేసిందని తెలిపారు.

బాధితుడికి నష్టపరిహారం త్వరలోనే చెల్లిస్తామని,అలాగే అటవీ ప్రాంతంలోకి పశువుల కాపరులు, రైతులు, సమీప పంట చేనులో పనికి వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పెద్దపులికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించినచో అటవీ శాఖ వారికి వెంటనే సమాచారం అందించాలని కోరారు. సమీప గ్రామాలలో డప్పు చాటింపు కూడా చేయించడమైనదని తెలిపారు.

quotes