మంచిర్యాల జిల్లా
తాండూరు
తేదీ :28 జూలై 2025
✍️ మనోజ్ కుమార్ పాండే,

తాండూర్ మండలంలోని కిష్టంపేట రైతు వేదికలో తాండూర్ మండలానికి సంబంధించిన 475 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను స్థానిక తహసిల్దార్ జ్యోత్స్న, స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ,ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు లబ్ధి పొందాలన్నా రేషన్ కార్డు ప్రామాణికమని, కానీ గత 10 ఏళ్లలో నూతన రేషన్ కార్డులు మంజూరు చేయకుండా. గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులు పెట్టిందని, ప్రజా ప్రభుత్వంలో ఇచ్చిన మాట మేరకు రేషన్ కార్డు ఇవ్వడమే గాక రేషన్ ద్వారా సన్న బియ్యం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజా సంక్షేమం దిశగా పాలన సాగిస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, సంబంధిత అధికారులు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.