భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
మణుగూరు మండలం
✍️దుర్గా ప్రసాద్
మణుగూరు మండలం, సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలో అశోక్ నగర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించడం అయినది. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు.. గాండ్ల సురేష్ మాట్లాడుతూ…
పేదవాడి చిరకాల కోరిక సొంత ఇంటికల ఆ కలను పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం నెరవేర్చిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి పేద ప్రజల సంక్షేమం పైనే ప్రత్యేక దృష్టి సారించిందని, పేదవారికి రేషన్ కార్డులను ఇచ్చి వారి జీవితాల్లో వేలుగు నింపిన ప్రజా ప్రభుత్వాన్ని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను భారీమెజారిటీతో గెలిపించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు గద్దల ఆదిలక్ష్మి, గణేష్ రెడ్డి, మాదాడి రాజేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొజ్జా త్రిమూర్తులు, శ్రీనివాస్, సతీష్, జంగాల కృష్ణ, మహిళా కాంగ్రెస్ కమిటీ సభ్యులు కొలపిన్ని మానస, కొల్లిపాక రమ పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ పాల్గొన్నారు.
