మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:28 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

జూలై 27 వ తేదీన సంగారెడ్డిలో జరిగిన ఖేలో ఇండియా సిటీ విమెన్స్ లీగ్ లో బెల్లంపల్లి పట్టణంలోని మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాల లోని పిల్లలు పాల్గొని ప్రతిభ కనబర్చారు.

కె.వైష్ణవి 42 కేజీల విభాగంలో, తమన్నా 39 కేజీ ల విభాగంలో, కరిష్మా 48 కేజీ ల విభాగంలో పాల్గొనగా, అయేషా 45 కేజీ విభాగంలో పాల్గొని 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది. వీళ్లను బెల్లంపల్లి మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ నీలు మేడం, వుషూ కోచ్ అంబాల శిరీష అభినందించారు. మెడల్ సాధించిన విద్యార్థిని సౌత్ జోన్ కి సెలెక్ట్ అయినట్టుగా కోచ్ శిరీష పేర్కొన్నారు.