✍️దుర్గా ప్రసాద్
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు ను రుద్రంపూర్ యూనియన్ నాయకులు శాలువాతో సత్కరించి సన్మానం చేశారు.
ప్రజా సేవకుడిగా, సామాజిక సేవలందిస్తూ, ప్రజల సమస్యలనే తన సమస్యలుగా గుర్తించి, ప్రజలకు తోడుగా ఉండే నాగా సీతారాములుకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తు కాంగ్రెస్ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్బంగా నాగా సీతారాములు మాట్లాడుతూ…
ప్రజా సేవకుడిగా, ప్రజలలో ఒకడిగా ఉంటూ మీ కోసమే పనిచేస్తానని, కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రంజిత్ కుమార్, శంకర్, MD.గౌస్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు
