మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:29 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే,
మంగళవారం శ్రావణ మాసం “నాగ పంచమి” సందర్భంగా తెల్లవారు జామున కెమికల్ హనుమాన్ ఆలయంలో 108 మంది భక్తులచే 108 హనుమాన్ చాలీసా పరాయణం మరియు 108 ఆలయ ప్రదక్షిణల కార్యక్రమాన్ని భక్తులు విజయవంతంగా పూర్తి చేశారు.
వృద్ధులు, మహిళలు, యువతీ, యువకులు, చిన్నారులు భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించి అధిక సంఖ్యలో పాల్గొని రామ నామ స్మరణతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
దైవిక కార్యక్రమంలో పాత్రులైన భక్తులందరినీ చల్లగా చూడాలని భావవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆలయ ప్రధాన అర్చకులు రాభట్ల హరీష్ శర్మ దీవెనలు అందించారు.
