మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:29 జూలై 2025,
✍️ మనోజ్ పాండే
తెలంగాణా మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కాలేజీలో లయన్స్ క్లబ్ బెల్లంపల్లి ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జనని హాస్పిటల్ మరియు శాంభవి ఐ విషన్ సెంటర్ తమ విలువైన సహకారం అందించారు.ఈ ఆరోగ్య శిబిరంలో ప్రసిద్ధ వైద్యులు: డా.జగదీష్ నాయుడు, ఎమర్జెన్సీ ఫిజీషియన్ అంజయ్య, కంటి వైద్య నిపుణులు విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ శిబిరంలో సుమారు 350 మంది విద్యార్థులు పాల్గొని తమ ఆరోగ్యాన్ని పరీక్షించుకున్నారు. వారికి అవసరమైన ఉచిత మందులు కూడా పంపిణీ చేసారు. ఈ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు అరుణ సుందరి, కార్యదర్శి ఆదర్శ్ వర్ధన్ రాజు, డి.నారాయణ రావు, కె.నర్సయ్య, తిరుపతి రెడ్డి, జయచందర్, పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి నీలు గారు, పాఠశాల సిబంది,హాస్పిటల్ సిబంది పాల్గొన్నారు.
విద్యార్థుల ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమేకాక, సమాజసేవ పట్ల దృక్పథాన్ని మరింత బలపరిచిందని లయన్స్ క్లబ్ సభ్యులు తెలిపారు.
