భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్

నేడు అనగా 29.07.2025న, ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులకు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుపై విచారణ చేపట్టాలని కోరుతూ రిట్ పిటిషన్ నంబర్.22007/2025 ద్వారా ఆదివాసీ సేన తరుపున దాఖలు చేసిన పిటిషన్ పైన ఈరోజు గౌరవ న్యాయమూర్తి జస్టిస్ భీమపాక నగేష్ గారు విచారణ చేపట్టడం జరిగినది.

ఈ యొక్క పిటిషన్ నందు విచారణలో ఆదివాసి సేన తరుపున న్యాయవాది సి. హెచ్.రవికుమార్ గారుg మరియు సోడే వెంకటేశ్వర్లు గార్లు వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వం వారు జారి చేసిన జీవో లు మరియు మెమో లను అనుసరించి, ఏజెన్సీ ప్రాంతాలలో ఎటువంటి మినహాయింపు పాటించలేదని మరియు ముఖ్యంగా LTR మరియు పీసా నిబంధనలకు విరుద్దంగా గిరిజనేతరులకు ప్రభుత్వం వారు ఇండ్లు కేటాయించడం చట్ట విరుద్ధం అని, వెంటనే గిరిజనేతరులకు ఏజెన్సీ ప్రాంతాలలో కేటాయించిన ఇండ్లను రద్దు పరచాలని కోరారు. వాదనలు విన్న గౌ. ధర్మాసనం.. ప్రభుత్వం వారిని తగిన సమాచారంతో హాజరవ్వలసిందిగా గౌరవ ధర్మాసనం ఆదేశిస్తూ ఉత్తర్వులు జారి చేస్తూ, తదుపరి విచారణ ఆగస్టు- 5 వ తేదికి వాయిదా వేసినది.

ఇట్లు
వజ్జ జ్యోతి బసు,
ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు.