భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ, జూలై 28,2025
✍️దుర్గా ప్రసాద్

 విద్యార్థుల్లో మౌలిక అక్షరాస్యత మరియు గణిత సామర్థ్యాల  సాధనలో ముఖ్యంగా పాఠశాల గ్రంథాలయాలు ఎంతో ఉపయోగపడతాయనీ వాటిని  విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకునే విధంగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని పాల్వంచ మండల విద్యాశాఖ అధికారి ఏ శ్రీరామూర్తి కోరారు.

పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పాత పాల్వంచ ఉన్నత పాఠశాల లో సోమవారం జరిగిన కాంప్లెక్స్ సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ…

పాఠశాల గ్రంథాలయాలు విద్యార్థుల్లో పఠనాశక్తి పెంపొందించినని, వాటి వినియోగం నందు ఉపాధ్యాయులు ఎంతో కృషి చేయాలని విద్యార్థులకు అందుబాటులో గ్రంధాల పుస్తకాలను ఏర్పాటు చేయాలని, విద్యార్థుల స్థాయికి అనుగుణంగా పాఠ్యపుస్తకాలను ఎంపిక చేసుకోవాలని, ప్రతి సంవత్సరం కొత్త పుస్తకాలను గ్రంథాలయంలోనికి ఏర్పాటు చేసుకోవాలని, ప్రతిరోజు పాఠశాలలో గ్రంథాలపిరియడు చక్కగా నిర్వహించాలని తెలియజేయడం జరిగింది.

ఈ శిక్షణ కార్యక్రమంలో పాత పాల్వంచ, బొల్లూరుగూడెం, యానంబైల్, జగన్నాధపురం, కేటీపీఎస్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ప్రకాష్ రావు, మంగమ్మ , బిపిఎల్ కుమారి,మండల రిసోర్స్ పర్సన్ గా మంజుశ్రీ, రఘురాం, సత్య శ్రీ, కవిత వ్యవహరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మంగమ్మ గారు, KTPS పాల్వంచ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు BPRL కుమారి గారు జిల్లా రిసోర్స్ పర్సన్ సలికినేని రాజశేఖర్ గారు, కాంప్లెక్స్ అసిస్టెంట్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.