ఆగస్టు రెండో వారం నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభం నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా సగటు వర్షపాతం 347.2 మి. మీ ఉండగా… 338.2 మి. మీ నమోదైనట్టు తెలిపింది. గత 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లాలోని బేలలో 2.63 సెం. మీ అత్యధిక వర్షపాతం నమోదైంది.
