అమెరికాలోని ద్వీప రాష్ట్రం హవాయి మొత్తానికి సునామీ హెచ్చరిక జారీ అయింది.

అలలు ఆరు అడుగుల ఎత్తు వరకు ఎగసిపడుతున్నాయి. రాష్ట్రం మొత్తం సునామీ సైరన్లు వినిపించాయి. దాంతో పర్యాటకులు, స్థానికులు తమ స్వస్థలాలను వీడి ఎత్తైన ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.

ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలంతా తరలుతుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్లన్నీ కారులతో బారులు తీరాయి. ఆ దృశ్యాలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి.

………………………………………….………………………


ప్రపంచాన్ని వణికించిన టాప్ 5 భూకంపాలు..

ఇప్పటివరకూ ప్రపంచాన్ని వణికించిన 5 అతి భారీ భూకంపాలు ఇవే.

చిలీలో 1960లో 9.5 తీవ్రతతో అతి భారీ భూకంపం.

అమెరికాలోని అలస్కాలో 1964లో 9.2 తీవ్రతతో భారీ భూకంపం.

2004లో ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో 9.1 తీవ్రతతో భారీ భూకంపం.

2011 లో జపాన్ లోని తోహోకులో 9.1 తీవ్రతతో భారీ భూకంపం,

1952లో రష్యాలోని కమ్చట్కా క్రై ప్రాంతంలో 9 తీవ్రతతో భారీ భూకంపం.