సేవలాల్ యువసేన తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బానోత్ ప్రతాప్ నాయక్ నియామకం…
భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ పట్టణ కేంద్రం
✍️దుర్గా ప్రసాద్
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ కేంద్రంలో జరిగిన సేవలాల్ సేన రాష్ట్ర స్థాయి సమావేశం నందు జగ్గుతండ గ్రామం పాల్వంచ మండలంకు చెందిన బానోత్ ప్రతాప్ నాయక్ ని సేవాలాల్ యువసేన తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
సేవలాల్ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భానోత్ హుస్సేన్ నాయక్ నియామక పత్రాన్ని అందజేసి, సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో నడవాలని, గిరిజన చట్టాలపై అవగాహన కల్పించి నిత్యం గిరిజన ప్రజల మధ్య ఉండి గిరిజన జాతి కోసం పోరాటం చేయాలని దిశ నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమం నందు రాష్ట్ర స్థాయి నాయకులు విద్యార్థి సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంగోత్ నగేష్, ధర్మ జాగరణ రాష్ట్ర అధ్యక్షులు మంగ్త్ మహారాజ్, జిల్లా అధ్యక్షులు శివ నాయక్, మండల అధ్యక్షులు పరమేష్ నాయక్ మరియు జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు.
