మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:30 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

గురువారం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సీఓఈ స్పాట్ కౌన్సిలింగ్.

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి డాక్టర్ అలుగు వర్షిని ఆదేశానుసారం బాలుర సిఓఈ బెల్లంపల్లి యందు ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ బైపీసీ గ్రూప్స్ యందు ఖాళీగా ఉన్న సీట్ల కొరకు స్పాట్ కౌన్సిలింగ్ 31 జూలై నాడు నిర్వహించబడునని ప్రిన్సిపాల్ ఆకిడి విజయసాగర్ తెలిపారు. జూలై 31 నాడు ఉదయం 9 గంటల నుండి ఒంటి గంట వరకు అప్లికేషన్ ఫామ్స్ సమర్పించవలసి ఉంటుందని, ఒంటి గంట తర్వాత ఎట్టి పరిస్థితుల్లో తీసుకోబడవని తెలిపారు.

స్పాట్ కౌన్సిలింగ్ కి వచ్చేటప్పుడు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకురావలేనని, అలాగే మార్చి 2025 రెగ్యులర్ గా ఉత్తీర్ణత సాధించి 70% మార్కులు పైన ఉన్న విద్యార్థులు మాత్రమే కౌన్సిలింగ్ కు హాజరు కావాలని తెలిపారు.

యంపిసి బైపిసి గ్రూపుల యందు ఖాళీ సీట్ల వివరాలు ఎస్సీ క్యాటగిరి యందు ఎంపీసీ 10 బైపిసి 20 సీట్లు కలవు ఎస్టీ క్యాటగిరి యందు ఎంపీసీ ఒకటి, బైపీసీ రెండు, బీసీ కేటగిరి యందు ఎంపీసీ రెండు, బైపిసి 5, ఓసి క్యాటగిరి యందు ఎంపీసీ ఒకటి,బైపిసి రెండు, మైనార్టీ కేటగిరి యందు ఎంపీసీ ఒకటి,బైపిసి ఒకటి సీట్లు కలవని ప్రిన్సిపాల్ తెలిపారు.