మంచిర్యాల జిల్లా,
నెన్నెల మండలం,
తేదీ:30 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే,
మంచిర్యాల జిల్లా, నెన్నెల మండలం, లంబడి తండాకు చెందిన దరావత్ తులసి (32) బెల్లంపల్లికి వెళ్తున్న లోడుతో ఉన్న ఇసుక ట్రాక్టర్ పై నుంచి జారి పడి మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్ళితే …
నెన్నెలలో బ్యాంక్ పని కోసం బయలుదేరిన తులసి ఖర్జీ నుండి బెల్లంపల్లి ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను లిఫ్టు అడిగి ఇంజన్ కు ట్రాలీకి మధ్యలో ఉన్న రాడ్డుపై నిలబడింది. నెన్నెల మూలములుపు వద్ద అదుపు తప్పి జారి పడిన మహిళ, ట్రాలీ టైరు కింద పడి మరణించినట్టు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నట్టు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
