జగిత్యాల జిల్లా కేంద్రం
✍️కిషన్ రెడ్డి
జగిత్యాల నుంచే జర్నలిస్టుల పోరు యాత్ర – సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ జాప్యం తగదు… – టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య – జగిత్యాల టీడబ్ల్యూజేఎఫ్ లో భారీగా చేరికలు
జగిత్యాల, ఆగస్టు 26, 2025 :
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత జాప్యం చేయడం తగదని, దీర్ఘ కాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా, జర్నలిస్టుల సమస్యలను ఇంత వరకు పరిష్కరించలేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల జన చైతన్య యాత్ర చేస్తామని, ఈ యాత్ర జగిత్యాల నుంచే ప్రారంభిస్తామని ఆయన ప్రకటించారు.
సమస్యలపై సమిష్టి పోరాటానికి జర్నలిస్టులు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని రూబీ ఫంక్షన్ హాలులో జరిగిన టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా సర్వసభ్య సమావేశం, జర్నలిస్టుల జాయినింగ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మామిడి సోమయ్య మాట్లాడుతూ…
రాష్ట్రంలో మెజారిటీ జర్నలిస్టుల జీవన స్థితిగతులు దయనీయంగా మారుతున్నాయని, ముఖ్యంగా మండలస్థాయి విలేకరుల పరిస్థితి ఆధ్వాన్నంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పదేళ్లు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా ద్రోహం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభు త్వం కూడా అదే బాటలో నడుస్తుందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రెండు జర్నలిస్టు సంఘాలు పాలకుల పక్షాన నిలిచి జర్నలిస్టుల సమస్యలను విస్మ రించాయని ఆయన విమర్శించారు. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్టు జర్నలిస్టుల పేరు చెప్పి అధికార పదవులు పొంది పాలకులకు ఊడిగం చేస్తూ జర్నలిస్టులకు అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఆ సంఘాల పట్ల జర్నలిస్టులు పూర్తి విశ్వాసం కోల్పోతున్నారని అన్నారు. గత ప్రభుత్వం గానీ, ఈ ప్రభుత్వం గానీ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టు కేసుల సాకుతో అన్యాయం చేశాయని అన్నారు. చాలా ఏళ్ళుగా చిన్న పత్రికలను ప్రభుత్వం గుర్తించకుండా అణచివేస్తున్నదని మామిడి సోమయ్య ఆందోళన వ్యక్తం చేశారు. అర్హత ఉన్న చిన్న, మధ్య తరహా పత్రికలను ఎంపానల్మెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు
కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా కొత్త అక్రెడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇతర సంఘాల నుంచి జర్నలిస్టులు పెద్ద ఎత్తున టీడబ్ల్యూజేఎఫ్ లో చేరుతున్నారని చెప్పారు. రాబోయే రెండు మూడు మాసాల్లో అన్ని జిల్లాల్లో ఫెడరేషన్ మహాసభలు పూర్తి చేసి పెద్ద ఎత్తున రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తామని తెలిపారు.
జగిత్యాల జిల్లాలో టీయూడబ్ల్యూజే – ఐజేయు సంఘాల నుంచి చాలా మంది జర్నలిస్టులు ఫెడరేషన్ లో చేరడం ద్వారా సంఘం మరింత బలపడిందని అన్నారు. ఫెడరేషన్ లో చేరిన ఐజేయూ నేషనల్ కౌన్సిల్ మెంబర్ మహ్మద్ ఇమ్రాన్, నాయకులు కోటగిరి దశరథం, గుండెటి రాజు తదితరులను ఆయన యూనియన్ లోకి ఆహ్వానించారు.
ఈ సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్ డబ్ల్యూజే) కార్యదర్శి
పులిపలుపుల ఆనందం, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వల్లాల జగన్, బండి విజయ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు కుడితాడు బాపురావు తదితరులు మాట్లాడుతూ, జగిత్యాల జిల్లాలో ఫెడరేషన్ ను మరింత బలోపేతం చేయాలని కోరారు.
టీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టుల సమస్యలపై నిరంతం పోరాడుతూ, జర్నలిస్టులకు అండగా ఉంటుందని అన్నారు. విలేకరులు పాలకుల ముందు తలవంచకుండా స్వతంత్రంగా వ్యవహరించాలని అన్నారు.
జిల్లా అధ్యక్షుడు ద్యావర సంజీవ రాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఫెడరేషన్ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు జైపాల్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఎన్నం కిషన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మేనేని రవీందర్ రావు, ఉపాధ్యక్షులు ఉత్తం మహేష్, రాగం రమేష్, కాసం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఆర్. శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శి ఆముదం లింగారెడ్డి, సహాయ కార్యదర్శి కాంతారావు, కోశాధికారి మేనేని శ్రీనివాస రావు, కార్యవర్గ సభ్యులు నగేష్, కొప్పుల శ్రీధర్, ముల్కల రాజేశం, భూమి వేణు మాధవ్, సీహెచ్ రోజా, దూడ జీవన్, బి.లావణ్య, ఎండి ఆజం, దూడం శ్రీశైలం, ప్రవీణ్, మోహన్ రావు, వంగల రమేష్, గుగ్గిల సత్యనారాయణ, బాస మహేష్, శ్రావణ్, శ్రీనివాస్, భోగ సాగర్, మాణిక్యం గంగాధర్, దాదాపు వందమంది జర్నలిస్టులు పాల్గొన్నారు.
జిల్లా అధ్యక్షుడిగా ఇమ్రాన్
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా మహ్మద్ ఇమ్రాన్ (ఆంధ్రప్రభ జిల్లా బ్యూరో) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఇప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న ద్యావర సంజీవ రాజు అధ్యక్ష పదవికి స్వచ్చందంగా రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఇమ్రాన్ ను జనరల్ బాడీ సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అదేవిధంగా ద్యావర సంజీవరాజును (సూర్య జిల్లా రిపోర్టర్) రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నుకున్నారు. వీరితో పాటు జిల్లా ఉపాధ్యక్షుడుగా కోటగిరి దశరధం (మన తెలంగాణ మెట్పల్లి ఆర్సి ఇన్చార్జ్),
సాంస్కృతిక కార్యదర్శిగా గుండేటి రాజు(సీనియర్ జర్నలిస్టు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఇవి కూడా చదవండి…
- మోతె పంచాయతీలోని చింతకుంట గిరిజన గ్రామ ఆదివాసీల మంచినీటి కష్టాలు తీరేదెన్నడు…
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
- హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
- అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
- తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య
- కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు…
- విఘ్నాలు లేకుండా వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలి….
- బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన డిస్కం ఉద్యోగులు
- మానవత్వం చాటుకున్న యువకుడు…
