ముంబై లోకల్ రైలులో ఓ యువకుడు బరి తెగించాడు. ప్రయాణికురాలి పక్కన కూర్చుని హస్తప్రయోగం చేసుకుంటున్నాడు.

సదరు వ్యక్తిని బాధిత మహిళ, మరో వ్యక్తి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని తీవ్రంగా కొట్టారు. ఈ క్రమంలో అతడు రన్నింగ్ ట్రైన్ నుంచి దూకి వెళ్లిపోయినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. “ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించాలి. అతడిని కఠినంగా శిక్షించాలి” అని కామెంట్లు పెడుతున్నారు.