మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:30 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి: సిర్పూర్ కాగజ్ నగర్ నుండి బీదర్ వెళ్ళవలసిన ఇంటర్ సిటీ రైలులో ఇంజన్ వైపు ముందు భాగంలో మాత్రమే 4 జనరల్ బోగీలు ఏర్పాటు చేసి రెండు ఏసీ బోగీలు, D1, D2, D3, D4, D5, మహిళ ల బోగీలు ఏర్పాటు చేయడంతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

చాలా వరకు ప్రయాణికులు రద్దీని దృష్టిలో పెట్టుకుని వెనుక బోగీల వైపు కూడా వెళ్ళి D సిరీస్ బోగీలు సాధారణ రిజర్వేషన్లు అని తెలిసి ముందు వైపు ఉన్న జనరల్ బోగీల వైపుకు పరుగెత్తాల్సి వేస్తుందని వాపోతున్నారు. రైల్వే అధికారులు ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ముందు వైపు వెనుక వైపు సమాన జనరల్ బోగీలు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.