కొత్తగూడెం ఏరియాలోని ఎస్ సి డబ్ల్యూ ఏ ఉద్యోగులకు పదోన్నతుల ఉత్తర్వులు అందజేసిన కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్.

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
కొత్తగూడెం
సింగరేణి సెప్టెంబర్ 1,2025
✍️దుర్గా ప్రసాద్

సోమవారం రోజున కొత్తగూడెం ఏరియాలోని ఎన్ సి డబ్ల్యూ ఏ ఉద్యోగులకు 01 సెప్టెంబర్ నాటికి అర్హత కలిగిన వారికి కేడర్ స్కీమ్/ టైం బౌండ్ ప్రమోషన్ ఇవ్వడం జరిగింది.

ఇందులో భాగంగా మొత్తం 35 మంది ఉద్యోగులు అర్హత కలిగి ఉన్నారు వారిని జిఎం కార్యాలయంలో ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం మార్చి/ సెప్టెంబర్ నెలలో కేడర్ స్కీం ప్రమోషన్లు అందజేస్తామని అందులో భాగంగా అర్హత కలిగిన ఉద్యోగులకు ఉత్తర్వులు అందిస్తున్నమని, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ అంకితభావంతో విధుల యందు నైపుణ్యాన్ని పెంచుకోవాలని, వారికి కేటాయించిన విధులను రక్షణతో చేసి కంపెనీ పురోభివృద్ధిలో తమ వంతు పాత్రను పోషించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే ఉత్తర్వులు అందుకునే ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిఎంతో పాటు ఏఐటీయూసీ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ జె. గట్టయ్య, ఐ.ఎన్.టి.యు.సి వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, ఏరియా ఇంజనీర్ కే.సూర్యనారాయణ రాజు, డిజిఎం (పర్సనల్) జి.వి. మోహన్ రావు, పద్మావతి ఖని ఏజెంట్ రామ్ భరోస్ మహాతో, డివైపిఎం జి. హరీష్ ఇతర విభాగాల అధిపతులు, ఆఫీస్ సిబ్బంది, ఉత్తర్వులు తీసుకొనుటకు వచ్చిన ఉద్యోగులు పాల్గొనడం జరిగింది.