సికింద్రాబాద్ జేబీఎస్ బస్టాండ్ సమీపంలోని టిఫిన్ సెంటర్లు, స్టాల్స్ను కంటోన్మెంట్ బోర్డు అధికారులు బుధవారం తెల్లవారుజామున కూల్చివేశారు.

కంటోన్మెంట్ భూభాగంలో అనుమతి లేకుండా దుకాణాలు నిర్వహించటం చట్ట విరుద్ధమని పలుమార్లు నోటీసులు ఇచ్చినా యజమానులు ఖాళీ చేయలేదు.

దీంతో అధికారులు జేసీబీలతో కూల్చివేతలు చేపట్టారు. ఈ చర్యను సీఈఓ మధుకర్ నాయక్ పర్యవేక్షించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సెప్టెంబర్ 17న జేబీఎస్ ప్రాంతానికి రానున్న నేపథ్యంలో ఆక్రమణలపై అధికారులు కఠినంగా వ్యవహరించారు.