సెప్టెంబర్ 15న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరుగనుంది.

తుమ్మిడి హట్టి బ్యారేజ్ నిర్మాణం, పంచాయతీ ఎన్నికలు, 42% బీసీ రిజర్వేషన్లపై మంత్రివర్గం చర్చించనుంది. హైకోర్టు తీర్పు ప్రకారం సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉండటంతో అధికారులు ఆందోళనలో ఉన్నారు.

మరోవైపు బతుకమ్మ పండుగకు సిద్ధతగా ప్రతి జిల్లాకు సీఎం 30 లక్షలు కేటాయించారు. మహిళలకు చీరల పంపిణీ, పండుగ ఏర్పాట్లపై కూడా సమావేశంలో చర్చ జరిగే అవకాశముంది.