భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
కొత్తగూడెం ఏరియా
సింగరేణి సెప్టెంబర్ 10
✍️దుర్గా ప్రసాద్

కొత్తగూడెం ఏరియాలో 2025-26 వార్షిక సంవత్సరంనకు వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ లో భాగంగా కొత్తగూడెం ఏరియాలోని ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్స్, రుద్రంపూర్ లో(బుధవారం)న కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు క్రీడలు కబడ్డీ బాల్ బ్యాడ్మింటన్ లతో ఈ వార్షిక సంవత్సరం లోని యూపీఎస్&జి ఏ క్రీడాలను ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ… క్రీడలు మానసిక ఉల్లాసాన్ని శారీరక దారుఢ్యాన్ని పెంచుతాయని ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని క్రీడలలో పాల్గొనడం వలన ప్రతి విషయంలోనూ పాజిటివ్ థింకింగ్ పెరుగుతుందని అందువలన మన వ్యక్తిగత జీవితాలలో ఉన్నత స్థాయిలో ఉండడానికి ఎంతగానో దోహదం చేస్తాయని తెలియజేయడం జరిగింది. గెలుపు ఓటమి లతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు క్రీడా స్ఫూర్తితో ఇటువంటి ప్రమాదాలు (దెబ్బలు) తగిలించు కోకుండా పాల్గొనాలన్నారు.

క్రీడలలో పాల్గొను ప్రతివారు పాజిటివ్ థింకింగ్ తో పాల్గొనాలని రీజినల్, కంపెనీ లెవెల్, కోల్ ఇండియా లెవెల్ లో జరుగు క్రీడలలో పాల్గొని కొత్తగూడెం ఏరియాకు కీర్తి ప్రతిష్టాలు పెంపుందించాలన్నీ క్రీడాకారులకు తెలియజేయండి జరిగింది.

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా జిఎం తో పాటు కొత్తగూడెం ఏరియా ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ వి మల్లికార్జునరావు, ఐఎన్టియుసి వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, ఎస్ఓటు జిఎం జీవి.కోటిరెడ్డి ఎజిఎం (సివిల్) సిహెచ్. రామకృష్ణ, డిజిఎం (పర్సనల్) జి.వి. మోహన్ రావు, డివైపిఎం జి. హరీష్, అసిస్టెంట్ స్పోర్ట్స్ సూపర్వైసర్ ఎం.సి పోస్నేట్, యూనియన్ ప్రతినిధులు స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ భూక్యా.భీముడు, జనరల్ కెప్టెన్ బి. వెంకటేశ్వర్లు, వివిధ క్రీడాల కెప్టెన్స్, క్రీడలలో పాల్గొనుటకు వచ్చిన క్రీడాకారులు ఇతర సభ్యులు పాల్గొన్నారు.