< 1 Min

బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య ఈ నెల 14న రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లపై అవమానం జరిగిందని, అందుకే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికలు 42% రిజర్వేషన్లు అమలు చేసిన తరువాతే జరగాలని డిమాండ్ చేశారు. హైకోర్టు బీసీ రిజర్వేషన్ జీవోపై స్టే ఇవ్వడం దారుణమని, జివో నెంబర్ 9 శాస్త్రీయ కులగణన ఆధారంగా జారీ చేశామని చెప్పారు. రిజర్వేషన్లను 50%కి పరిమితం చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొని, బీసీలు ఎంత శాతం ఉన్నారో అంత రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బంద్‌కు అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరారు.