✍️ దుర్గా ప్రసాద్
హైదరాబాదులో మింట్ కాంపౌండ్ లోని TRVKS కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేవీ జాన్సన్ గారి అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి జెన్కో కార్యవర్గ సమావేశములో KTPS 7 వ దశ నందు JAO గా పనిచేయుచున్న ముత్యాల రాంబాబు గారు జెన్కో కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గా పాశం రవిబాబు (KTPS 5&6 ), రాష్ట్ర అసిస్టెంట్ సెక్రటరీగా తిప్పారపు రమేష్ (YTPS) జెన్కో వర్కింగ్ ప్రెసిడెంట్ గా T అజయ్ (పాలేరు), జెన్కో అడిషనల్ సెక్రటరీగా రాసురి శ్రీనివాస్( KTPS 5&6), జెన్కో అసిస్టెంట్ సెక్రటరీగా కే బిక్షపతి (KTPS 7 వ దశ),జెన్కో ట్రెజరర్ గా తిరుపతి శ్రీశైలం గార్లు ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినారు.
ఈ సమావేశంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కోడూరి ప్రకాష్ గారు, రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కరెంట్ రావు గారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కమలాకర్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చారుగుండ్ల రమేష్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పుట్టపాక కిరణ్, దంచనాల రాంబాబు, రాష్ట్ర అసిస్టెంట్ సెక్రటరీ ఎస్కే సాదిక్ పాషా, జెన్కో నాయకులు, అన్ని రీజియన్ అధ్యక్ష , కార్యదర్శులు, బ్రాంచ్ నాయకులు మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు.