Lavc60.9.100
< 1 Min

Ulcer Awareness: ఈ మధ్యకాలంలో జీర్ణ సమస్యలు పెరిగి, అల్సర్ ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. ఇది పొట్ట, పేగులపై గాయాలు కలిగించి తీవ్ర ఇబ్బందులకు దారి తీస్తుంది.

కడుపులో నొప్పి, ఉబ్బరం, గుండెల్లో మంట, వికారం, వాంతులు వంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి. నల్ల మలం, ఆకలి లేకపోవడం, వెయిట్ లాస్ వంటి లక్షణాలు కూడా ప్రమాద సూచనలు. ఇవి గమనిస్తే వెంటనే వైద్య సలహా తీసుకోవాలి. అల్సర్‌ను నిర్లక్ష్యం చేస్తే రక్తస్రావం, పేగులకు రంధ్రాలు, క్యాన్సర్ ప్రమాదం ఉంటుంది. ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం.